పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : తనసైన్యముయొక్క పాటును జూచి జరాసంధుఁడు విజృంభించుట

నంట మగధీశుఁ డాత్మసైన్యంబు
నంకుకడకేఁగు టంతయుఁ జూచి
రోషలయకాలకాలునిభంగి
ర ధనుర్గుణోద్ధతి సింహనాద   - 570
నేమి నిర్ఘోషంబు నెరపంగ రథము
కాపాలుని తేరుఁ దియించి పలికె. 
పిన్నవాఁడవు మున్ను భీమసంగ్రామ
మెన్నఁడైనను జూచి యెఱుఁగుదే నీవు? 
టుశత్రువన దావపాపకుండనఁగ
నిట జరాసంధుని నెఱుఁగవే తొల్లి? 
లఁ గోసివేసెదఁ రలక నిలువు
లఁచి నా యల్లునిఁ గ్రక్కింతు” ననుచు; 
మ్ములు వఱగించ యందంద సీరి
యెమ్ములుఁ గీలింప నెంతయు నలిగి
“యేమిటికీరజ్జలిటు ప్రేలె”దనుచు
నాహాబలశాలి రదంబు డిగ్గి
వాకుఁ దలవంచి చ్చుగోరాజు
పూనికె వాని యమ్ములు లెక్కఁగొనక
ములంబుఁ గొని హయంబులఁ జావమోది
యెసఁగి సూతుని తల నిల డొల్ల వ్రేసి
దిసి జరాసంధు కాయంబు మోముఁ 
దియంగ నడిచి నిశ్చలితుగాఁ జేసి
పెగేలుఁ గట్టి యాభీమవిక్రముఁడు
పెపెళ నార్చినఁ బేర్చి సైన్యములు.   - 580
హశంఖారావటుసింహనాద
టుల ఘోషముల దిక్సంధులు పగిలె.